Pawan Kalyan: జల్జీవన్ బడ్జెట్ పెంచాలని కేంద్రాన్ని కోరా..! 26 d ago
గత ప్రభుత్వం జల్జీవన్ మిషన్ నిధులు వాడలేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోపించారు. మంగళవారం కేంద్రమంత్రి సీఆర్ పాటిల్తో భేటీ అనంతరం పవన్ మీడియాతో మాట్లాడుతూ జల్జీవన్ బడ్జెట్ పెంచాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వకపోవడంతో..నిధులు వినియోగించలేదని పేర్కొన్నారు. గత ప్రభుత్వ తప్పిదాలను ఇప్పుడు అనుభవిస్తున్నామని విమర్శించారు. అలాగే రేపు ప్రధాని మోదీని కలుస్తునట్లు చెప్పారు.